ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి మోదీ-షా ద్వయం! - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి మోదీ-షా ద్వయం!

November 27, 2019

మహారాష్ట్ర రాజకీయం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఆయన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కూడా ఆహ్వానిస్తారని సమాచారం. దీనిపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ..ప్రతిఒక్కరినీ ఆహ్వానిస్తాం. అమిత్‌ షాని కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. 

Amit Shah.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత సీఎం పదవిపై శివసేన, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన.. బీజేపీ పార్టీతో తెగతెంపులు చేసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి కూడా బయటికి వచ్చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో శివసేన ఆహ్వానాన్ని మన్నించి బీజేపీ నేతలు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వస్తారా.. లేదా.. అన్నది వేచి చూడాలి. గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం ఉంటుందని సమాచారం.