Prime Minister Modi, Amit Shah and Venkaiah Naidu condole the death of Krishna Raju
mictv telugu

కృష్ణంరాజు మరణంపై ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్య నాయుడు సంతాపం

September 11, 2022

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ కేంద్రమంత్రి హైదరాబాద్ లో మృతి చెందడం పట్ల ప్రధాన మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కృష్ణం రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ పీఎం మోదీ ట్వీట్ చేశారు. ‘‘ రాబోయే తరాలు అతని సినీ నైపుణ్యం, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయి. సమాజసేవలో ముందున్నారు. రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేశారు.

తెలుగు సినీ ప్రముఖుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మనల్ని విడిచిపెట్టడం చాలా బాధ కలిగించిందని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నారని.. సమాజ అభివృద్ధికి కృషి చేశారని. ఆయన మరణం తెలుగు చిత్రసీమలో లోటును మిగిల్చిందంటూ ట్విట్టర్ ద్వారా అమిత్ షా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మరణం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని అన్నారు. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు నాకు అత్యంత ఆత్మీయులు. వాజ్ పేయి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించే వారని గుర్తు చేసుకున్నారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరమని తెలిపారు.