ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. తెలుగులో మోదీ ప్రసంగం - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. తెలుగులో మోదీ ప్రసంగం

July 4, 2022

ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ… అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం అదృష్టమన్నారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి.. ఇలాంటి పుణ్యభూమికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను సన్మానించారు.
స్ఫూర్తి కోసమే ఆజాదీకా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్లులోని ధ్యానమందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రకటించారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగాలు చేశారని, త్యాగధనులను స్మరించుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని మోదీ పేర్కొన్నారు.