Prime Minister Modi has apologized to the people of Rajasthan
mictv telugu

ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ.. ఎందుకంటే

October 1, 2022

Prime Minister Modi has apologized to the people of Rajasthan

దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాజస్థాన్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మోకాళ్లపూ కూర్చుని మూడు సార్లు కిందకి వంగి దండం పెడుతూ సారీ చెప్పారు. అయితే నిబంధనలకు విలువనిస్తూ ఆయన ప్రవర్తించిన తీరు పట్ల ప్రశంసలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిదంటే.. త్వరలో ఎన్నికల జరుగనున్న గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటించారు.

అక్కడ పలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం సరిహద్దుల్లో ఉన్న దక్షిణ రాజస్థాన్‌లోని అబూరోడ్డులో ర్యాలీని ప్లాన్ చేశారు. అయితే ఆలస్యం అవడంతో ర్యాలీ కుదరలేదు. ముందుగా అనుకన్న ప్రకారం మోదీ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. అయితే రాత్రి పదవడంతో మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ‘నేను ఇక్కడకు రావడం ఆలస్యమైంది. ఇప్పుడు రాత్రి పదవుతోంది. నిబంధనలు పాటించాలని నా మనస్సాక్షి చెప్తోంది. మీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. మీ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చి మాట్లాడతానని హామీ ఇస్తున్నా’నని చెప్పి చివర్లో భారత్ మాతాకీ జై అని నినదించారు. అనంతరం వేదికపై మోకాళ్లపై కూర్చుని సభికులకు నమస్కరించారు. ఈ వీడియోను బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఆ రోజు అది ఏడవ కార్యక్రమం. ఆయన వయసు 72. నవరాత్రి ఉపవాసం చేస్తున్నారు. అయినా నిబంధనలు పాటించారు’ అని ట్వీట్ చేసింది.