Prime Minister Modi launched 5G services
mictv telugu

5జీని ప్రారంభించి స్వీడన్‌లో ఉన్న కారును నడిపిన ప్రధాని మోదీ

October 1, 2022

Prime Minister Modi launched 5G services

భారతీయులు ఎంతగానో ఎదురు చూస్తున్న 5జీ టెక్నాలజీకి శనివారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జియో ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శించిన మోదీ.. 5జీ వల్ల సేవలు ఏ విధంగా మెరుగుపడతాయో తెలుసుకున్నారు. వైద్య రంగంలో 5జీ పాత్రను అకాశ్ అంబానీ ప్రధానికి వివరించారు.

అనంతరం రిమోట్ పద్ధతిలో కారును ఎలా నడపవచ్చో స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఎరిక్సన్ బూతులో కూర్చుని స్వీడన్‌లో ఉన్న కారును వర్చువల్‌గా నడిపారు. రోబోటిక్స్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో 5జీ పోషించబోయే పాత్రను ఆసక్తిగా తిలకించారు. ప్రారంభమైన 5జీ సేవలు ఇప్పటికిప్పుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్‌లో వాడుకలో రాగా, ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో త్వరలో రాబోతుంది. వాటి తర్వాత హైద్రాబాద్, బెంగళూరు వంటి నగరాలకు అందుబాటులోకి వస్తుంది. డిసెంబర్ 2023 కల్లా దేశంలోని అన్ని పట్టణాలు, తాలూకాలలో 5జీ సేవలను విస్తరిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖేష్ అంబానీ, ఆకాశ్ అంబానీ, సునీల్ మిట్టల్, మంగళకుమారం బిర్లా తదితరులు పాల్గొన్నారు.