భారత్ భక్తి బలోపేతం.. అయోధ్య తీర్పుపై మోదీ  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ భక్తి బలోపేతం.. అయోధ్య తీర్పుపై మోదీ 

November 9, 2019

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును విజయంగానో, ఓటమిగానో భావించాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజలు శాంతి సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఆయన రోజు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో భాగంగా పంజాబ్ లోని డేరా బాబా నాయక్‌లో గురుద్వారాను సందర్శించారు. తీర్పు వివరాలు తెలుసుకు ట్వీట్ చేశారు. 

Prime minister modi.

‘తీర్పును  గెలుపుగానో, ఓటమిగా చూడకూడదు. మీరు రామభక్తులైనా, రహీం భక్తులైనా ఇది భారత్ భక్తిని(దేశభక్తి) బలోపేతం చేయాల్సిన సమయం ఇది.. అప్పుడే శాంతి, సౌఖ్యాలు విలసిల్లుతాయి.  సహృద్భావ వాతావరణంలో చారిత్రక తీర్పులో ఈ సమస్య పరిష్కృతమైంది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి నిరూపితమైంది.  చట్టం ముందు అందరూ సమానులే, అందరం ఐకమత్యంతో జాతి అభివృద్ధికి, ప్రతి పౌరుడి అభివృద్ధికి పాటుపడాలి..’ అని ఆయన కోరారు. తీర్పుకు ముందు కూడా మోదీ ప్రజలను సంయమనం పాటించాలని కోరడం తెలిసిందే. అయోధ్య వివాదస్పద భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించిన కోర్టు.. మసీదు కోసం అయోధ్యలో ముస్లింలకు 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించడం తెలిసిందే.