Prime Minister Modi stopped the convoy for an ambulance in himachal pradesh
mictv telugu

అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపేసిన ప్రధాని మోదీ.. వీడియో

November 9, 2022

Prime Minister Modi stopped the convoy for an ambulance in himachal pradesh

ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అంబులెన్స్ కోసం ఏకంగా తన కాన్వాయ్‌‌ని ఆపేసి దారి ఇచ్చారు. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌‌లో ఎన్నికలు జరుగనుండడంతో ప్రధాని బుధవారం ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో చంబి పట్టణానికి వెళ్లగా.. కాన్వాయ్ వెళ్తున్న రోడ్డుపై అంబులెన్స్ వెళ్లడం ప్రధాని కంట పడింది.

 

దీంతో విషయాన్ని గ్రహించిన మోదీ.. కాన్వాయ్‌‌ని రోడ్డు పక్కకు జరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాత ప్రధాని కాన్వాయ్ తిరిగి రోడ్డుపైకి వచ్చింది. ఈ ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రధాని హోదాలో కాన్వాయ్ ఆపాల్సిన అవసరం లేనప్పటికీ మోదీ వ్యవహరించిన తీరు ఆకట్టుకుందని కామెంట్లు చేస్తున్నారు. అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంబి, సుజన్ పూర్‌‌‌‌లలో జరిగిన రెండు బహిరంగ సభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.