Prime Minister Modi to unveil Alluri statue in Bhimavaram
mictv telugu

ప్రధాని ఆవిష్కరించే అల్లూరి విగ్రహం ప్రత్యేకతలు ఇవీ

June 29, 2022

Prime Minister Modi to unveil Alluri statue in Bhimavaram

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోనుంది. జులై 4న అల్లూరి జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తున్నారు. పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్ మునిసిపల్ పార్కులో ఏర్పాటు చేసే ఈ విగ్రహం ఇప్పటికే భీమవరం చేరుకుంది.

సుమారు 15 టన్నుల బరువు, 30 అడుగుల పొడవు ఉండే ఈ కాంస్య విగ్రహాన్ని రూ. 3 కోట్లతో తయారు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి సినీ హీరో మెగాస్టార్ చిరంజీవిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్థానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణం రాజు హాజరుకానున్నారు. కాగా, అల్లూరి 125వ జయంతి, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం రెండూ ఒకేసారి రావడం గమనార్హం.