Prime Minister Modi unveiled Netaji's statue at India Gate
mictv telugu

ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

September 8, 2022

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకశిలా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆవిష్కరించారు. 28 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పటివరకు ఉన్న రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చగా, వలసవాద విధానాలు, చిహ్నాల మార్పే లక్ష్యంగతా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని కర్తవ్య పథ్‌గా నామకరణం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం సెంట్రల్ విస్టా అవెన్యూని ప్రారంభించారు. అనంతరం కర్తవ్య పథ్ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను కలిసి వారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు.కాగా, ఈ ఏడాది జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ స్టాచ్యూని ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు విగ్రహాన్ని పెట్టారు. తమిళనాడుకు చెందిన శిల్పి యోగిరాజ్ ఏకశిలా గ్రానైట్‌పై ఈ విగ్రహాన్ని చెక్కారు. మొత్తం బరువు 65 టన్నులు కాగా, గ్రానైట్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి తరలించడం విశేషం.