కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ వ్యక్తిగత హామీ - MicTv.in - Telugu News
mictv telugu

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రధాని మోదీ వ్యక్తిగత హామీ

November 12, 2022

MODI

మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. బాగా కష్టపడ్డారంటూ మెచ్చుకున్నారు. బేగంపేటలో బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభ ముగిసిన తర్వాత ఎయిర్ పోర్టులో ప్రధాని రాష్ట్ర బీజేపీ నేతలతో కాసేపు ముచ్చటించారు. వరుస ప్రకారం నాయకులను పలకరిస్తూ వెళ్తున్న మోదీకి.. రాజగోపాల్ రెడ్డి వంతు రాగానే బీజేపీ నేతలు ఆయనను ప్రధానికి పరిచయం చేశారు.

దీంతో ఆగిన మోదీ.. రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేకంగా 2 నిమిషాలు ముచ్చటించారు. టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారంటూ భుజం తట్టి అభినందించారు. అంతేకాక.. నేను చూసుకుంటా అంటూ వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. అనంతరం మిగిలిన నాయకులతో మాట్లాడి తెలంగాణతో తాజా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌‌‌లో రామగుండం బయల్దేరి వెళ్లారు.