Prime Minister Narendra Modi meets Chinese President Xi Jinping
mictv telugu

చిరు నవ్వుతో స్నేహం చిగురించేనా?

November 16, 2022

భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కలిశారు. ఇండోనేషియా బాలివేదికగా ఇది జరిగింది. జీ 20 శిఖరాగ్ర సదస్సులో యాదృచ్చికంగా మోదీ,జిన్‌పింగ్ కలిశారు. ఈ చిరు నవ్వుతో రెండు దేశాల మధ్య స్నేహం చిగురిస్తుందా?గల్వన్ ఘటనల తర్వాత జరిగిన కలయిక సరిహద్దుల్లో వివాదాల్ని తగ్గిస్తుందా?ఏదో మొహమాటానికే కలిశారా?

యాదృచ్చికమే…

ఇండోనేషియా అధ్యక్షుడు జోకోవీడోడో జీ 20 సదస్సుకు వచ్చిన అతిథులకోసం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎదురుపడ్డారు. చిరునవ్వుతో ముందుగా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాసేపు నవ్వుతూ ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంతకు ముందు సెప్టెంబర్‌లో ఓసారి ఎదురుపడినా ఇద్దరూ మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు కలిసి మాట్లాడటంతో ఇరుదేశాల మధ్య సంబంధాలకు దోహదం చేస్తుందంటున్నారు. సరిహద్దుల్లో వివాదాల్సి పరిష్కారం దిశగా అడుగులు పడతాయని భావిస్తున్నారు.

గల్వాన్ తర్వాత

లడ్డాక్‌లోని గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత ఇరుదేశాల అధినేతలు కలవడం ఇదే తొలిసారి.సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్ లో సమర్‌ఖండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో ఎదురుపడినా పలకరించుకోలేదు.ఎవరి దారినా వారు వెళ్లిపోయారు. గల్వాన్ లో చైనా బరితెగించి కయ్యానికి కాలు దువ్వింది. నిబంధనలను ఉల్లంఘించి ఘర్షణలకు దిగింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత్ , చైనా సైనికులు చనిపోయారు. ఆతర్వాత రెండు దేశాలు సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో తరచుగా డ్రాగన్ కవ్వింపులకు దిగుతూనే ఉంది. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టింది.

శక్తివంతమైన కూటమి

ఇండోనేషియాలోని బాలి వేదికగా జీ20 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. రెండురోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో జీ20 సభ్యదేశాలన్నీ పాల్గొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ , ప్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌తో పాటు పలువురు హాజరయ్యారు. ప్రపంచంలో శక్తివంతమైన కూటమిగా జీ20కి పేరుంది. డిసెంబర్ 1 న ఇండోనేషియా నుంచి భారత్ బాధ్యతలు తీసుకోనుంది.