జగన్‌కు హామీ ఇచ్చాను : ప్రధాని మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు హామీ ఇచ్చాను : ప్రధాని మోదీ

May 26, 2019

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాలపాటు మోదీతో భేటీ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ కూడా జగన్‌తో భేటీపై ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో సమావేశం అద్భుతంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నాను’ అని ట్వీట్‌‌లో మోదీ పేర్కొన్నారు. ఇక ఆ ట్వీట్‌ తెలుగు, ఇంగ్లీష్‌ రెండు బాషల్లో చేయడం విశేషం.