prime minister praised pathan movie modi speech in the parliament
mictv telugu

పార్లమెంటులో పఠాన్ మూవీ గురించి ప్రసంగం

February 9, 2023

prime minister praised pathan movie modi speech in the parliament

షారూఖ్ మూవీ పఠాన్ సంచలనం మామూలుగా లేదు. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతున్న ఈ సినిమా గురించి స్వయంగా ప్రధానే చెప్పడం ఇప్పుడు మరొక విశేషం. వివాదాలతో మొదలైన సినిమా కలెక్షన్ల వర్షం కురిసిస్తోంది. ఇది సాధించిన విజయాన్ని ప్రధాని మోడీ పార్లమెంటులో చర్చించారు. తన ప్రసంగంలో మూవీ గురించి తెగ పొగిడేశారు.

కాశ్మీర్లో థియేటర్లలో పఠాన్ మూవీ హౌస్ ఫుల్ గా నడుస్తోందని చెప్పారు ప్రధాని మోడీ, చాలా ఏళ్ళ తర్వాత శ్రీనగర్ లో బాలీవుడ్ సినిమాలు ఆడుతున్నాయని చెప్పారు. దీన్ని అడ్డం పెట్టుకుని పరోక్షంగా కాంగ్రెస్ కు చురకలు అంటించడానికి ప్రయత్నం చేశారు. మరోవైపు బాలీవుడ్ నటుల మీద, సినిమాల మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయకూడదని సొంత పార్టీ వాళ్ళకు హితవు పలికారు మోడీ. కాశ్మీర్లో ఒకప్పుడు ఉగ్రవాదులు రాజ్యం ఏలారని, ఇప్పుడు వారి ఆటలు సాగడం లేదని దానికి నిదర్శనమే పఠాన్ సినిమా అక్కడ హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడడం అని ప్రధాని అన్నారు. కాశ్మీర్లో తాము చేసిన గొప్ప పనులకు ఇదొక ఉదాహరణ అంటూ గర్వంగా ప్రకటించుకున్నారు.

పుల్వామా దాడుల తర్వాత కాశ్మీర్ మీద మోడీ ప్రత్యేక దృష్టిని పెట్టారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అజిత్ దోవల్ నాయకత్వంలో అక్కడ భద్రతను మరింత పెంచారు. సరిహద్దులను కట్టుదిట్టం చేయడంతో పాటూ ఉగ్రవాదులకు నగదు సరఫరాకు కళ్ళెం వేశారు. ఈ లోపు పాకిస్తాన్ పరిస్థితి కూడా దిగజారడంతో అక్కడ పరిస్థితులు చక్కబడడ్డాయని అంటున్నారు. కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయని చెబుతోంది కేంద్రం. అందులో భాగంగానే కాశ్మీర్లో ఐనాక్స్ నిర్మిండం, అందులో సినిమాలు విడుదల అవడం అని చెబుతున్నారు. ఉగ్రవాదుల భయం తగ్గడంతో ప్రజలు కూడా హీయిగా బయటకు వచ్చి సినిమాలు చూస్తున్నారని ప్రధాని అన్నారు.