భారత ప్రధాని కోసం సొరంగం.. ఎందుకంటే! - MicTv.in - Telugu News
mictv telugu

భారత ప్రధాని కోసం సొరంగం.. ఎందుకంటే!

February 5, 2020

భారత ప్రధానమంత్రి కోసం దేశచరిత్రలోనే తొలిసారి సొరంగాన్ని నిర్మించనున్నారు. ప్రధాని తన నివాసం నుంచి ఎలాంటి ఆటంకాలూ లేకుండా పార్లమెంటుకు చేరుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. ‘సెంట్రల్ విస్టా’ ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నట్లు ప్లానింగ్ పనులకు నేతృత్వం వహిస్తున్న బిమల్ పటేల్ వెల్లడించారు. 

ప్రధాని, రాష్ట్రపతి వంటి వీఐపీలు రోడ్లపై వెళ్లడం వల్ల  ట్రాఫిక్ సమస్యలు తలెత్తి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని నివారించడానికే టన్నెల్ నిర్మాణానికి సంకల్పించామని తెలిపారు. ఈ సొరంగం వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడమే కాకుండా, భద్రత కూడా కట్టుదిట్టంగా ఉంటుందన్నారు.  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద ప్రధాని నివాసాన్నిసౌత్ బ్లాక్‌కు మారుస్తారని చెప్పారు. రక్షణ బలగాల కార్యాలయాలను తొలగించి, వాటి స్థానంలో స్పెషల్ గ్రూప్ ప్రొటెక్షన్ ఆఫీసును ఏర్పాటు చేస్తామని, మంత్రుల శాఖలను వేరో చోటికి తరలించి ఆ స్థానంలో ఒక జాతీయస్థాయి మ్యూజియాన్ని నిర్మిస్తామని చెప్పారు.