రేపు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

రేపు ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం.. ఎందుకంటే

April 18, 2022

pm

కేవలం స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న మాత్రమే ఎర్రకోట నుంచి ప్రధానులు ప్రసంగిస్తారు. మిగతా రోజుల్లో ఏ ప్రధాన మంత్రీ ఎప్పుడూ ప్రసంగించిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. కానీ, మోదీ ఆ రికార్డును ఈ నెల 21న తన పేరిట రాసుకోబోతున్నారు. సిక్కుల మత గురువు తేగ్ బహదూర్ జయంతిని పునస్కరించుకొని ఢిల్లీలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక, గురు తేగ్ బహదూర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులతో పాటు దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.