వ్యాక్సినేషన్‌లో సిద్దిపేటకు ప్రధానమంత్రి అవార్డు.. హరీష్ రావు హర్షం - MicTv.in - Telugu News
mictv telugu

వ్యాక్సినేషన్‌లో సిద్దిపేటకు ప్రధానమంత్రి అవార్డు.. హరీష్ రావు హర్షం

April 12, 2022

gfdgbvfd

జాతీయ మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్ వేసిన తొలి జిల్లాగా సిద్ధిపేట నిలిచింది. వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్ వేసుకోని చిన్నారలను గుర్తించి వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది విజయవంతం అయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కేటగిరీలో సిద్ధిపేట జిల్లాను ప్రధాన మంత్రి అవార్డు – 2019కి ఎంపిక చేసింది. ఈ నెల 20, 21 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదును కేంద్రం జిల్లాకు అందిస్తుంది. ఈ విజయంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన సిబ్బందిని అభినందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో ప్రతీ చిన్నారికీ వ్యాక్సిన్ అందేలా తమ శాఖ కృషి చేస్తుందని వెల్లడించారు. కాగా, మిషన్ ఇంద్ర ధనస్సు పథకంలో భాగంగా కేంద్రం దేశంలో గుర్తించిన 220 జిల్లాల చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తోంది. దీని వల్ల 12 రకాల ప్రాణాంతక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.