బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జులై 2న హైదరాబాదుకు వస్తుండడం తెలిసిందే. ఆయనతో పాటు పార్టీకి చెందిన ముఖ్యనాయకులు, ముఖ్యమంత్రులు వస్తున్నారు. దీంతో నగర పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించగా, ప్రధాని బస, పర్యటించే మార్గంలో నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ క్రమంలో పాతబస్తీకి చెందిన మాజిద్ అట్టర్ అనే యువకుడిని మొఘల్ పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజిద్ ఫేస్బుక్లో నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే నిరసనలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై నిఘా ఉంచారు.