బాలికతో శృంగారం.. బ్రిటన్ రాణి కొడుకు వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

బాలికతో శృంగారం.. బ్రిటన్ రాణి కొడుకు వివరణ

November 17, 2019

మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ కొడుకు ప్రిన్స్ ఆండ్రూ వివరణ ఇచ్చాడు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నాడు. ‘ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నట్లు నాకు గుర్తులేదు.. ’ అని చెప్పుకొచ్చాడు. 

Prince Andrew.

అమెరికాలో బాలలతో శృంగారం, వారి అక్రమ రవాణాకు సంబంధించి అరెస్టయి, జైల్లోనే చనిపోయిన ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలపైనా స్పందించాడు. జెఫ్రీ లైంగికంగా వాడుకున్న వర్జీనియా రాబర్ట్స్ అనే యువతి.. ఆండ్రూపై ఆరోపణలు చేసింది. 2001లో తాను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆండ్రూ తనతో శృంగారం చేశాడని, అంతకు ముందు ఆయనకు చెమటలు పట్టాయని చెప్పింది. దీనిపై ఆండ్రూ స్పందిస్తూ..  ‘ఆ రోజు నేను నా కూతురితో కలసి పిజ్జా సెంటర్ కు వెళ్లాను. రాబర్ట్స్‌ను కలసినట్లు నాకు గుర్తులేదు. నాకు చెమటలు పట్టాయన్నది అబద్ధం. నాది చెమటలు పోసే శరీరం కాదు..’ అని అన్నాడు. తానున రాబర్ట్స్ నడుంపై చెయ్యేసి ఉన్నట్లు ఫోటో సంగతేంటని అడగ్గా నో కామెంట్ అని జవాబు దాటవేశాడు. జెఫ్రీ అప్పట్లో విండ్సర్ కేజిల్లో అతిథిగా ఉన్నాడని, అదేం పెద్ద తప్పుకాదని తెలిపాడు. జెఫ్రీ అద్భుతమైన మనుషులకు ఒక చోటికి తెచ్చేవాడనికి కితాబిచ్చాడు.