భారత మంత్రి అబద్దం చెప్పాడు..బ్రిటన్ ప్రిన్స్ ఆఫీస్ - MicTv.in - Telugu News
mictv telugu

భారత మంత్రి అబద్దం చెప్పాడు..బ్రిటన్ ప్రిన్స్ ఆఫీస్

April 5, 2020

Prince Charles Office Denies Indian Minister's Ayurveda Cure coronavirus

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్‌కు సోకిన కోవిడ్-19 వైరస్ ఆయుర్వేదం, హోమియోపతి చికిత్స ద్వారా తగ్గిపోయిందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వెల్లడించిన సంగతి తెల్సిందే. అయితే ఈ వ్యాఖ్యలను ప్రిన్స్ ఆఫీస్ తీవ్రంగా ఖండించింది. భారత మంత్రి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేసింది. ప్రస్తుతం చార్లెస్ సెల్ఫ్ ఐసొలేషన్ నుంచి బయటకు వచ్చారని, ఎన్.హెచ్.ఎస్ సలహా మీద ఆయనకు వైద్య చికిత్స జరిగిందని, ఆయన కోలుకున్నారని చార్లెస్ ఆఫీస్ తెలిపింది. “ఈ సమాచారం అవాస్తవం. యూకే ఆరోగ్య అధికారుల సలహా మేరకే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు వైద్య చికిత్స జరిగింది” అని చార్లెస్ కార్యాలయం ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ..‘బెంగళూరులోని సౌక్య అనే రిసార్ట్ నుంచి ఆయనకు వైద్య సేవలు అందాయి. సౌక్య ఆయుర్వేద రిసార్ట్ డాక్టర్ ఐజాక్ మత్తయ్య స్వయంగా నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. తాను ఆయుర్వేదం, హోమియోపతి ద్వారా ప్రిన్స్ ఛార్లెస్‌కు చికిత్స చేశానని, అది విజయవంతం అయిందని డాక్టర్ మత్తయ్య నాకు చెప్పారు’ అని శ్రీపాద్ నాయక్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. అంతేకాకండా ప్రిన్స్ ఛార్లెస్‌కు జరిగిన చికిత్స గురించి అధ్యయనం చేయాలని తన మంత్రిత్వ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ చికిత్స విధానం, ప్రక్రియలపై నివేదికను సమర్పించాలని డాక్టర్ మత్తయ్యను కోరినట్లు చెప్పారు. కాగా, ప్రిన్స్ ఛార్లెస్, ఆయన సతీమణి కెమెల్లా క్వారంటైన్ పాటించగా.. ఆమెకు కరోనా వైరస్ నెగెటివ్ అని తేలింది.