Prince Harry details incident brother William in new boo
mictv telugu

అన్న నన్ను కొట్టిండు.. ప్రిన్స్ హ్యారీ.. నా భార్య విషయంలో..

January 5, 2023

అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు సహజం. కౌరవపాండవులైనా బ్రిటిష్ ప్రిన్స్‌లు అయినా తేడా వస్తే కొన్ని విషయాల్లో కొట్టుకోవడం ఖాయం. రెండోవాడు కావడంతో త్రుటిలో సింహాసనం కోల్పోయిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ తన విషయంలో ఇలాంటిదే జరిగిందంటున్నాడు. తన భార్య మేఘన్ మెర్కెల్ విషయంలో తన అన్న ప్రిన్స్ విలియం తనను గల్లా పట్టుకుని కొట్టాడని చెప్పాడు. ‘స్పేర్‌’ పేరుతో రాసిన తన ఆత్మకథలో అతడు బ్రిటన్ రాజవంశీకుల ఇంటి గొడవలు బయటపెట్టాడు. అన్న ఎందుకు కొట్టాడో వివరంగా రాసుకొచ్చాడు. పుస్తకంలోని వివరాల ప్రకారం..

మేఘన్ వ్యక్తిత్వంపై విలియమ్‌ ఓ రోజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. హ్యారీ అడ్డుకుని తన భార్యను అలా అనొద్దని చెప్పాడు. దీంతో పెద్దోడికి కోపమొచ్చింది. చిన్నోడిని కాలర్ పట్టుకుని మెడలోని హారం గుంజేశాడు. అంతేకాకుండా తమ్ముణ్ని నేలపైకి తోసేశాడు. కుక్కలు కూడు తినే బొచ్చె తగిలి చిన్నోడి వీపుకు పెద్ద గాయమైంది.

ఎలాగోలా పైకి లేచి అన్నను గెటౌట్ అన్నాడు. విలయం విసవిసా వెళ్లిపోయాడు. హ్యారీ గాయం మానడానికి ఆరు నెలలు పట్టింది. అతని ఆత్మకథ పుస్తకం ఈ నెల 10న మార్కెట్లోకి రానుంది. హ్యారీ ఆఫ్రికా నల్లజాతి మూలాలు ఉన్న మేఘన్‌ను ప్రేమించి పెళ్లాడ్డం బ్రిటన్ తెల్ల రాజవంశీయులకు నచ్చలేదని ప్రచారంలో ఉంది. హ్యారీ తనకు రాజరిక లాంఛనాలు వద్దని అమెరికా వెళ్లిపోయాడు. అయితే చిన్నవాడు కాబట్టి సింహాసనం దక్కదనే అక్కసుతోనే అలా చేశాడనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.