Prince Harry Killed 25 In Afghanistan As Pilot In British Army
mictv telugu

25 మందిని చంపా.. అయినా సిగ్గుపడటం లేదు

January 6, 2023

Prince Harry Killed 25 In Afghanistan As Pilot In British Army

ఆఫ్ఘనిస్తాన్‌లో అపాచీ హెలికాప్టర్ పైలట్‌గా ఉన్న సమయంలో తాను 25 మందిని చంపినట్లు చెప్పాడు ప్రిన్స్ హ్యారీ. అలా చంపినందుకు తానేమీ గర్వపడట్లేదని, అలా అని సిగ్గుపడటం లేదని అన్నారు. లక్ష్య చేధనలో అదొక భాగమని చెబుతూ.. చెస్ లో పావుల్ని ఏరివేసినట్లు.. వారందర్నీ తొలగించానన్నారు. త్వరలో ప్రిన్స్ హ్యారీ ఆత్మకథగా ఓ పుస్తకం రాబోతుంది.

ఆ పుస్తకంలో తాను బ్రిటిష్‌ ఆర్మీలో పైలట్‌గా పని చేసిన సందర్భాలను వివరించారు. 2007 – 08లో ఎయిర్‌ కంట్రోలర్‌గా, 2012-13లో పైలట్‌గా ఈ దాడులు చేసినట్లు చెప్పారు. అమెరికాపై జరిగిన 9/11 దాడుల్లో బాధితుల కుటుంబాలను తాను కలిశానని, ఆ గుర్తులకు ప్రతీకారంగా తాను అఫ్గాన్‌లో తాలిబన్ల లక్ష్యంగా జరిపిన దాడుల్లో పాల్గొన్నానని పేర్కొన్నారు.

వచ్చే వారం విడుదల కానున్న “స్పేర్” అనే ఈ పుస్తకంలో, హ్యారీ పైలట్‌గా ఆరు మిషన్‌లను చేపట్టాడని, అది “మానవ ప్రాణాలను తీయడానికి” దారితీసిందని డైలీ టెలిగ్రాఫ్ అనే ఓ పత్రిక నివేదించింది. ప్రిన్స్‌ హ్యారీ పదేండ్ల పాటు బ్రిటిష్‌ ఆర్మీలో పని చేశారు.

కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. తాను మిలిటరీలో ఉన్న సమయం.. తన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడిందని చెప్పాడు. హ్యారీ తన రాచరిక హోదా కారణంగానే కాకుండా ఇస్లామిస్ట్ తీవ్రవాదులతో పోరాడుతున్న సమయం కారణంగా కూడా తన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.