ఏపీ బడ్జెట్ లెక్కల విషయంలో జగన్ సర్కార్‌పై కేంద్ర ఆర్ధికశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థలు, సొసైటీలు తీసుకున్న ఆఫ్ బడ్జెట్ అప్పులపై వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం కోరింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని.. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాసింది.
రుణం తీసుకున్న సంస్థ పేరు, ఏ ఆర్ధిక సంస్థ నుంచి రుణం పొందారు , అలాగే ప్రభుత్వం హామీకి సంబంధించిన ఉత్తర్వుల వివరాలను సమర్పించాలని చెప్పింది. ప్రభుత్వ పథకాల అమలుకు బడ్జెట్లో నమోదుకాని రుణాల వివరాలు చెప్పాలని పేర్కొంది. రుణాలకు సంబంధించిన వివరాలను ఈనెల 31లోపు అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని పీఏజీ కార్యాలయం కోరింది.
2021-22లో కేంద్రం ఏపీకి రూ.42,472 కోట్లు అప్పు చేసుకోవడానికి అనుమతిచ్చింది. అయితే… గత మూడేళ్లలో రాష్ట్రం కేంద్రం ఇచ్చిన అనుమతి కంటే అదనంగా రూ.17వేల కోట్లు అప్పు చేసింది.