మనదేశంలోనూ ఖైదీల విడుదల.. కమిటీల ఏర్పాటు   - MicTv.in - Telugu News
mictv telugu

మనదేశంలోనూ ఖైదీల విడుదల.. కమిటీల ఏర్పాటు  

March 23, 2020

Prisoners to be released on bail to decongest jail due to coronavirus .

నిన్నటి జనతా కర్ఫ్యూ కాస్తా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌గా మారిపోయింది. రోడ్డుపై జనం కనిపిస్తే చాలు పోలీసులు క్లాసులు పీకుతున్నారు. జరిమానాలు, జైళ్లు అని భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో కిక్కిరిసిన జైళ్లలో ఖైదీల పరిస్థితి ఊహించుకుంటేనే వణుకుపుడుతుంది. కరోనా భయంతో ఇరాన్ ఇప్పటికే వేలమంది ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తక్కువ తీవ్రతగత నేరాలను చేసిన వారిని తాత్కాలికంగా ఇళ్లకు పంపించారు. 

మనదేశంలోని ఖైదీలు కూడా తమను జైల్లో ఉంచొద్దని డిమాండ్ చేస్తున్నారు. కోల్‌కతాలోని డండం జైల్లో పెద్ద గొడవే చేశారు. కిక్కిరిసిన జైల్లో తాము కరోనాతో చచ్చిపోతామని ఖైదీలు సిబ్బందితో గొడవ పడ్డారు. అంతేకాకుండా జైలుకు నిప్పెట్టారు. ఈ నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించడానికి మనదేశంలోనూ ఖైదీల విడుదలకు సన్నాహాలు సాగుతున్నాయి. పెరోల్‌పై విడుదల కాగల ఖైదీలను గుర్తించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం హైలెవల్ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ర్టాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. 4నుంచి ఆరు 6 వారాలకు పెరోల్‌పై బయటికి పంపే అర్హత ఉన్న ఖైదీలను గుర్తించాలని,  ఏడేళ్ల జైలుశిక్ష పడే అవకాశమున్న ఖైదీలకు పరిస్థితిని బట్టి పెరోల్ ఇవ్వొచ్చని సూచించింది.