టీం ఇండియాలో చోటే లక్ష్యంగా యువఆటగాడు పృథ్వీ షా రెచ్చిపోతున్నాడు. రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో మరోసారి బీసీసీఐ సెలెక్టర్లకు కబురు పంపాడు.ముంబై తరుఫున దిగిన పృథ్వీ షా..అస్సాంపై ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 389 బంతుల్లో 379 పరుగులు చేశాడు. క్వాడ్రాపుల్ సెంచరీ సెంచరీ చేసి రికార్డులు తిరగరాసేలా కనిపించిన షా..17 రన్స్ దూరంలో ఔటయ్యాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా మాత్రం రికార్డులకెక్కాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో మొత్తం 49 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అతను బౌండరీల రూపంలోనే 220 పరుగులు చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 240 పరుగులతో నాటౌట్‌గా ఉన్న పృథ్వీ షా.. రెండు రోజు ట్రిపుల్ సెంచరీ సాధించాడు. పృథ్వీషాతో పాటు, అజింక్యా రహానె కూడా సెంచరీతో చెలరేగడంతో ముంబాయి మొదటి ఇన్నింగ్స్‌లో రెండవ రోజు లంచ్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 608 పరుగులు చేసింది. రహానె 139* పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నాడు.
జూలై 2021లో అంతర్జాతీయ చివరి మ్యాచ్ ఆడిన పృథ్వీ..తర్వాత జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రీమిస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా రంజీల్లో రాణించి సెలెక్టర్లకు తాను ఉన్నా అని గుర్తుచేస్తున్నాడు. ధాటిగా ఆడే షాకు అవకాశాలు కల్పించాలని మాజీల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి.అయితే గిల్ కూడా ఓపెనర్‌గా రాణిస్తుండడంతో పృథ్వీకి అవకాశాలు తగ్గాయి.