సుప్రీం తీర్పు తూచ్.. ఆధార్ అడిగేస్తున్న ఈ-కామర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం తీర్పు తూచ్.. ఆధార్ అడిగేస్తున్న ఈ-కామర్స్

October 11, 2018

సుప్రీం కోర్టు తీర్పు నాలుక గీసుకోడానికి కూడా పనికిరావడం లేదు. ప్రైవేట్ సంస్థలు ప్రజల నుంచి ఆధార్ డేటా సేకరించరాదని కోర్టు ఇచ్చిన తీర్పును అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వం కాలరాసేస్తున్నాయి. తీర్పు ఎక్కడా  అమల్లోకి రావట్లేదు. ప్రతీ దానికి ఆధార్ నంబర్ తప్పనిసరంటూ కంపెనీలు ప్రజల ఆధార్ వివరాలు తీసుకుంటునే ఉన్నాయి. ఆధార్ వివరాలు తీసుకోవడానికి కంపెనీలకు అనుమతిస్తామని, దీనికోసం కొత్త చట్టం కూడా తెస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలివ్వడంతో కంపెనీలు మరింత రెచ్చిపోతున్నాయి.Private Companies Breaks Supreme Court Verdict flipkart and amazon asking Aadhaar number details from consumers for granting loans తాజాగా ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించాయి. రెండు సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. కొనడానికి డబ్బులు లేకున్నా.. 60,000వేలు అప్పు ఇస్తామని యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. అయితే ఇందుకోసం ఆధార్ నెంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది.. వాటి ఆధారంగా యూజర్లకు ఎంతవరకు క్రెడిట్ వస్తుందో తెలుస్తుంది.

అయితే తమ యూజర్లకు అప్పు ఇచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు వెరిఫికేషన్ కోసం ఆధార్ నెంబర్ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఒక్క ఆధార్ నెంబర్పై ఏకంగా అప్పులే ఇస్తుండటం, యూజర్లు కూడా ఆధార్ నెంబర్ వెల్లడిస్తూనే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తిమాటలే అవుతాయని వాదనలు వినిపిస్తున్నాయి.