స్కూల్ బస్సులు సేఫా.. పిల్లలు క్షేమంగా ఇల్లు చేరుకోవాలంటే..? - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ బస్సులు సేఫా.. పిల్లలు క్షేమంగా ఇల్లు చేరుకోవాలంటే..?

June 12, 2017

మీ పిల్లల్ని స్కూల్ కు బస్సుల్లో పంపుతున్నారా..? అవి కండీషన్ లేని బస్సులా..?అనుభవం లేని డ్రైవర్లు తోలుతున్నారా..? పరిమితికి మించి చిన్నారుల్ని ఎక్కిస్తున్నారా..? ఆర్టీయే రూల్స్ ని స్కూల్ మేనేజ్ మెంట్స్ కచ్చితంగా పాటిస్తున్నాయా..లేవా..బస్సులో స్కూలుకెళ్లిన పిల్లలు క్షేమంగా ఇల్లు చేరుకోవాలంటే..ప్రతి విద్యార్థి తల్లీదండ్రులు మస్ట్ గా ఇది తెలుసుకోవాలి..
స్కూల్స్ పాటించాల్సిన రూల్స్ ఇవే…

1. బస్సులన్నీ పసుపు రంగులో ఉండాలి.
2. పెద్దఅక్షరాలతో స్కూల్ బస్సుగా రాయాలి.
3.అద్దాలకు గ్రిల్స్, పిల్లలు ఎక్కడం, దిగడం కోసం బస్సుకు మెట్లు దగ్గరగా ఉండాలి.
4. బస్సుకు ఎమర్జెన్సీ డోర్, ఫైర్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అమర్చాలి.
5. ఎప్పటికప్పుడు బస్సు కండిషన్ చూడాలి.
6.50 ఏళ్లు లోపు, బ్యాడ్జి నంబర్ కలిగి కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్‌ను నియమించాలి
7.ప్రతి మూడు నెలలకొకసారి డ్రైవర్ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
8. బస్సులో డ్రైవర్ ఫొటోను ప్రదర్శించాలి.
9. సామర్థ్యానికి మించి విద్యార్థులను బస్సులో తరలించరాదు.
ఈ నిబంధనలు పాటిస్తున్నారో లేదో చూడాలి పేరెంట్స్. ఎంత బిజీగా ఉన్నా ఎప్పడోసారి వీటిని చెక్ చేయాలి. ప్రమాదం జరిగాక తెలుసుకునే దానికన్నా ముందే అలెర్ట్ గా ఉండటం మంచిది. సో మస్ట్ ఫాలో ది రూల్స్ పేరెంట్స్…