స్కూల్‌లో దారుణం.. లెగ్గింగ్స్ వేసుకొచ్చారని.. - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్‌లో దారుణం.. లెగ్గింగ్స్ వేసుకొచ్చారని..

November 20, 2019

డ్రెస్‌కోడ్ పేరుతో విద్యార్థులపై ఓ మిషనరీ స్కూలు అమానుషానికి పాల్పడింది. యూనిఫాంతో పాటు లెగ్గింగ్స్ వేసుకురావడాన్ని తప్పుబడుతూ దారుణంగా ప్రవర్తించారు. బాలికలు వేసుకున్న లెగ్గింగ్స్ తీసేయించి కర్కశత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా ప్రైవేటు స్కూలులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై  బాలికల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు యాజమాన్యం మాత్రం దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండటంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

Private School.

4 నుంచి 9 సంవత్సరాల వయసున్న బాలికలు స్కూలు యూనిఫాంతో పాటు లెగ్గింగ్స్‌ వేసుకొని స్కూలుకు వచ్చారు. దీంతో పాఠశాల డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్లు బలవంతంగా వాటిని తీసివేయించారు.చలికి వణికిపోతున్నాకూడా వారు కనికరించలేదు. రోజంతా అలాగే వుండేలా శిక్ష విధించారు.

దీనిపై  బాలికల తల్లదండ్రులు తీవ్ర ఆగ్రహం​ వ్యక్తం చేశారు. మైనర్ బాలికలపై ఈ విధంగా చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే స్కూలు హెడ్‌మిస్ట్రస్ అర్చన ఫెర్నాండెజ్ మాత్రం దీన్ని సమర్థించుకోవడం విమర్శలకు దారి తీసింది. చాలా సార్లు డ్రెస్‌కోడ్ పాటించాలని హెచ్చరించామని చెప్పారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపన చెప్పామని అయినా ఆందోళన దేనిక చేస్తున్నారంటూ ప్రశ్నించారు.  ఈ ఘటనపై బాలల హక్కుల సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.