private School Operator Expelled Dalit Daughter From School, Also Deprived Of TC
mictv telugu

బీజేపీకి ఓటేయ్యలేదని.. బాలికను స్కూల్ డైరెక్టర్…

November 4, 2022

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థికి ఓటేయ్యలేదన్న ఒక్క కారణంతో సిగ్గు మాలిన పనికి ఒడిగట్టాడు ఓ ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్. ఆ స్కూల్‌లో చదువుతున్న ఓ దళిత బాలిక తల్లిదండ్రులు.. బీజేపీకి ఓటు వేయనందుకు ఆగ్రహించి, ఆ బాలికను స్కూల్‌లోకి రాకుండా అడ్డుకున్నాడు. మధ్యప్రదేశ్లోని షాజాపుర్లో జరిగిందీ ఘటన.

షాజాపుర్లోని ఓ దళిత బాలికకు విద్యా హక్కు చట్టం కింద స్థానిక ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు. ఆ స్కూల్ డైరక్టర్ రవి పటీదార్ అనే వ్యక్తి ఇంటి నుంచి ఆయన వదిన అయిన సప్నా సచిన్ పటీదార్ అనే మహిళ బీజేపీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి గెలిచింది కూడా. అయితే బాలిక నివసిస్తున్న వార్డు నుంచి సప్నా కు ఒక్క ఓటూ పడలేదని, ఆ వార్డులో ఉంటున్న బాలిక తల్లిదండ్రులు కూడా ఆమెకు ఓటు వేయలేదని తెలుసుకున్నాడు రవి పటిదార్. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మరుసటి రోజు బాలికను స్కూల్ వద్ద అడ్డుకున్నారు. ఇక తనను స్కూల్కు రానివ్వమని అన్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు సీఎం హెల్ప్లైన్కు కూడా ఫిర్యాదు చేశారు. కాని ఎవరూ స్పందించలేదు. ఈ విషయమై బాలిక తండ్రి ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం వారి ఆరోపణలను ఖండిస్తోంది.