పిల్లల్ని వేస్తే ఆ స్కూళ్లోనే వేయాలి..! - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల్ని వేస్తే ఆ స్కూళ్లోనే వేయాలి..!

June 12, 2017

అబ్బా… చూడగ్గానే ఏం ఉందని అనిపిస్తుంది. పిల్లొడ్ని వేస్తే ఈ స్కూళ్లోనే వేయాలి. బయటే ఇలా ఉంటే లోపల ఇంకెలా ఉంటుందో…చదువు మస్తుగా చెబుతారేమో.. ఇక ఫిక్స్.. ఎంత ఖర్చు అయినా ఫర్వా లేదు…వేసి తీరాల్సిందే. ఇప్పుడే అడ్మిషన్ తీసుకోవాలి. లేట్ చేయొద్దు..లేటైతే సీటు దొరకదేమో …చలో ప్రైవేట్ స్కూల్…

బడి గంటలు మళ్లీ మోగాయి. బుడి బుడి అడుగులు అటువైపు పడ్డాయి. మరికొందరు అడుగులు వేయబోతున్నారు. గల్లీల్లో ఉండే ఫేమస్ స్కూల్స్ చుట్టూ పేరెంట్స్ ఆలోచనలు సుడిగాలిలా తిరిగాయి. వారిని, వీరిని తెలుసుకున్నాకా…డిసైడ్ అయ్యారు. చేర్పిస్తే ఆ స్కూల్లోనే చేర్పించాలని..ఎందుకిలా అంటే…?

ఆలోచన వచ్చిందే తడవుగా రాకెట్ స్పీడ్ తో అందమైన గ్రౌండ్ లో అడుగు పెడితే.. అడ్మిషన్ గురించి ప్రిన్సిపల్ తో మాట్లాడితే…. వాళ్లు చెప్పే ఫీజుల లిస్టు చెబితే… సగటు పేరెంట్స్ ఎలా స్పందిస్తారు..?వీరలెవల్లో బిల్డప్ లకు బోల్తా పడుతారా…?కార్పొరేట్ లో కసుక్కున దిగిపోతారా..? తీరా అందులోకి దిగాక గానీ అసలు మర్మం తెలవదా?

బడి గంట మోగాక తల్లిదండ్రుల గుండెల్లో దడ మొదలైంది. పిల్లల్ని స్కూల్ కు పంపుతూనే పెరిగిన ఫీజుల గురించి టెన్షన్ పడుతున్నారు. ఏడాదికేడాది పెరుగుతోన్న ప్రైవేట్ స్కూల్ ఫీజుల చార్ట్ చూసి దడుసుకుంటున్నారు. పిల్లలనైనా బాగా చదివిద్దామనుకుంటున్న తల్లిదండ్రుల వీక్ పాయింట్ ను ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. భారీగా ఫీజుల్ని పెంచేసి భారమేస్తున్నాయి. అడ్డూ,,అదుపూ లేకుండా చెలరేగిపోతున్న ప్రైవేట్ స్కూళ్లకు కళ్లెం వేయాల్సిన సర్కార్..కనీస ధర్మమైనా పాటించడం లేదు. ఫీజుల నియంత్రణకు వేసిన కమిటీ కాలయాపన చేస్తోంది. నివేదిక లు ఇవ్వకుండానే ఏళ్లకుఏళ్లు గడిపేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడు ఫీజుల్ని భారీగా పెంచేసి …పేరెంట్స్ తో ఆటలాడబోతున్నాయి.ఇంకెన్నాళ్లు ఈ కార్పొరేట్ దోపిడీ..కళ్లెం వేసేదెవరు..అసలు ఎందుకీ నిర్లక్ష్యం..వేలకు వేలు…లక్షలకు లక్షలు గుంజేస్తున్నా…అధికారులకు ఎందుకు కనిపించడం లేదు. మేనేజ్ మెంట్స్ వారిని లోబర్చుకుంటున్నావా..? ఏ పాఠశాల ఏ ఒక్క రూల్ ను పట్టించుకోవు.డోంట్ కేర్ తాము చెప్పిందే వినాలి…ఎంత అడిగితే అంత ఇవ్వాలి. లేదంటే పిల్లల్ని చేర్పించొద్దు…మంచి చదువు కావాలంటే..అడిగినన్ని పైసాలు ఇవ్వాల్సిందే అని సిగ్గులేకుండా ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
నర్సరీకి వేలకు వేలు…ఇంటర్నేషనల్ స్కూళ్లలోనైతే లక్షలకు లక్షలు…ఈ స్కూళ్లలో సీటు దొరికాలంటే ఆర్నెళ్ల ముందే రిజర్వ్ చేసుకోవాలి. అడిగినంత డొనేషన్ ఇవ్వాలి. క్లాస్ పెరిగే కొద్దీ వేలకు వేలు పెరిగుతూనే ఉన్నాయి. ఏటా పది నుంచి ఇరవై శాతానికిపైగా ఫీజులు పెంచేస్తున్నాయి. మళ్లీ బుక్స్ కు, యూనిఫాంలకు సెపరేట్ గా పైసా వసూల్ చేస్తున్నాయి. టెక్ట్స్ బుక్స్ , నోట్ బుక్స్ కి ఐదువేలకు పైగా గుంజుతున్నాయి. బయట రెండు,మూడు వేలకు దొరికే వీటిని రెట్టింపు ధరల్ని తీసుకుంటున్నాయి. యూనిఫాం విషయంలో కూడా అంతే. వీటిని స్కూళ్లలో అమ్మొద్దని డీఈఓలు ఎంత మొత్తుకున్నా…ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ పట్టించుకోదు. పేరెంట్స్ కు ఫోన్ల మీద ఫోన్లు కొట్టి కొనిపిస్తుంటాయి. సమ్మర్ హాలీడేస్ నుంచే ఈ అమ్మకాలు మొదలు పెట్టాయి. బడి గంట మోగే సరికి పీక్స్ కు వెళ్లిపోతాయి. ఇది అధికారులకు తెలిసినా పట్టించుకోరు.

ఇన్ని వేల ఫీజులు తీసుకుంటున్నా…చదవులకు సరిగ్గా చెబుతారా అంటే అదీ గ్యారంటీ లేదు. పిల్లొడు వీక్ ఉన్నాడంటే ట్యూషన్ పెట్టించామని మరి అంటారు. స్కూల్లో టీచర్లు ట్యూషన్స్ చెబుతారంటారు. వీళ్లు సరిగ్గా చదవు చెబితే మళ్లీ ట్యూషన్లు,గీషన్లు ఎందుకు..?మార్నింగ్ ఎయిట్ కి స్టార్టయ్యే స్కూల్…ఈవెనింగ్ దాకా చెబుతూనే ఉంటారు. మళ్లీ ఇంటికి హోంవర్కులు. ఇది మూమూలుగా కాదు ఓ రేంజ్ లో. తల్లీదండ్రులు దగ్గరుండీ మరి వాటిని చేయించాలి. ఇవి అయ్యే సరికి రాత్రి ఏడో, ఎనిమిదో అవుతుంది. తినేసి పడుకుంటే మళ్లీ పొద్దున్నే లేవాల్సిందే..పిల్లల్ని ఇంత రాచిరంపాన పెడుతున్నా ప్రైవేట్ స్కూల్స్ …వారి మానసిక స్థితి అర్థం చేసుకోలేకపోతున్నాయి. లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న స్కూల్స్… మళ్లీ ట్యూషన్లు అవసరం లేకుండా చదవులు చెప్పలేవా..? అంతా క్వాలిఫైడ్ టీచర్లు వారి దగ్గర ఉండటం లేదా..?నామ్ కే వాస్తిగా.. నడిపించేస్తున్నారా..?
చాలా స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు కూడా లేరు. బీఈడీ, టెట్ క్వాలిఫైన టీచర్లు పదుల సంఖ్యలోనే ఉన్నారు. మామూలు ఇంటర్ , డిగ్రీ చదివినోళ్లతోనే పాఠాలు చెప్పించేస్తున్నారు. హై క్వాలిఫైడ్ టీచర్లకు ఎక్కువ జీతాలు ఇయ్యాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారు. తల్లీదండ్రులు కూడా ఇవేవి పట్టించుకోకుండానే చేర్పించేస్తున్నారు. పిల్లల స్టడీ అయి సాటిస్ ఫై కాకపోతే.. ఒకటి , రెండుసార్లు ప్రిన్సిపల్ కు చెప్పి..అయినా ఫలితం లేకపోతే మరో స్కూల్ మార్చేస్తున్నారు. తప్ప యాజమాన్యాల్ని నిలదీసి అడగటం లేదు.ఎందుకు లే వీళ్లతో గొడవ అనుకుంటున్నారు. ఇదే ప్రైవేట్ స్కూల్స్ కు అలుసు అయింది.

చదవులోనే కాదు.. స్టూడెంట్స్ ట్రావెలింగ్ ను బిజినెస్ లా మార్చేశాయి. మూడు, నాలుగు కిలోమీటర్ల లోపే ఉన్నా పదివేలకు పైనే వసూలు చేస్తున్నాయి. సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లలను కుక్కేస్తున్నాయి. పికప్ , డ్రాపింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఉదయం 8.30 గంటలకు మొదలయ్యే స్కూల్ కోసం అయిదుకిలోమీటర్ల లోపు విద్యార్థిని పికప్ చేసుకునేందుకు ఏడుగంటలకే వాహనం వస్తుంది. ఇది ఆ రూట్ లో పిల్లల్ని అందిరినీ ఎక్కించుకుని స్కూల్ కు చేరే సరికి ఎనిమిదిన్నర అవుతుంది. దాదాపు గంటకు పైగా ట్రావెలింగ్ లోనే గడిచిపోతోంది. అదే పేరెంట్స్ దించేస్తే పది నిమిషాలు టైమ పడుతుంది. వారి బీజీ షెడ్యూల్ , జాబ్ టైమింగ్స్ కుదరకపోవడంతో స్కూల్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా కార్పొరేట్ దోపిడీ అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

ఇప్పటికైనా పెరిగిపోతున్న స్కూల్ ఫీజులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ కేరింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్పొరేట్ దోపిడీకి స్వయం పాలనలోనైనా ముకుతాడు వేయాలి. లేదంటే అవి అలాగే రెచ్చిపోతాయి. ప్రజలు పరేషాన్ అవుతూనే ఉంటారు.