నమస్తే తెలంగాణ పత్రికపై పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీస్ - MicTv.in - Telugu News
mictv telugu

నమస్తే తెలంగాణ పత్రికపై పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీస్

April 23, 2022

తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు పత్రికలైన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేలపై పార్లమెంటులో ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ రెండు పత్రికలు పనిగట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీపై తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సహాయం చేస్తున్నప్పటికీ అనుచితంగా విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. అలాగే తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హద్దులు మీరి ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కుటుంబ పార్టీల వల్ల ప్రజాస్వామ్యానికి ముంపు పొంచి ఉందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. పరిపాలన నుంచి కుటుంబ పార్టీలను దూరం పెట్టేలా ఎన్నికల ఎజెండాను ప్రధాని మోదీ ఖరారు చేశారని పేర్కొన్నారు.