కన్నుకొట్టి జాతీయ స్థాయిలో రాత్రికిరాత్రే సెలబ్రిటీగా మారిన మలయాళ నటి ప్రియా ప్రకావ్ వారియర్‌పై హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కొంటెచూపుల భామ నటించిన సదరు పాటలోని కొన్ని వాక్యాలు తమ మనోభావాలను, ప్రవక్తను, మక్కానును కించపరచేలా ఉన్నాయని కొందరు ముస్లింలు ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు స్టేషన్‌కు వచ్చి ఈమేరకు ఫిర్యాదు చేశారు. ‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలోని ఈ పాట, ప్రియ నటన ఇస్లాంకు విరుద్ధంగా ఉందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై చర్య తీసుకోలేమని, పూర్తి వివరాలు అందించాలని పోలీసులకు వారికి చెప్పినట్లు తెలుస్తోంది.