ప్రియా ప్రకాశ్ కలకలం. ఎక్స్‌పోజింగ్ మళ్లీ వార్తల్లోకి..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్ కలకలం. ఎక్స్‌పోజింగ్ మళ్లీ వార్తల్లోకి.. 

October 12, 2020

Priya Prakash latest photo shoot.. Exposing back into the news ..

కన్నుగీటి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రియా ప్రకాశ్ వారియర్ గుర్తుంది కదా. అప్పట్లో పెను సంచలనంగా మారిన ప్రియా ప్రకాశ్ కన్నుగీటిన వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. తాను తొలిసారి నటించిన ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా విడుదల కన్నా ముందే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క వీడియోతో స్టార్ అయిపోయిందని అందరూ భావించారు. కానీ, ప్రియా ఆ సినిమా తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. ప్రస్తుతం ‘చెక్’ అనే సినిమాలో నటిస్తుండగా అది 2021లో విడుదల కానుంది. అయితే ప్రియా గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. 

తాజాగా ఈ భామ అందాలను ఆరబోసింది. లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన ఫోటోతో కుర్రాళ్ల మతులు చెడగొట్టింది. ఎదభాగం కనిపించేలా మెడనిండా నగలు ధరించి పాపిట తీసి పొడవాటి జడ వేసుకుని ఫోటోకు పోజు పెట్టింది. పెద్ద కళ్ళు, చిన్న బొట్టు పెట్టుకుని మహారాణిలా హొయలు పోతోంది. ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు లైకులతో హోరెత్తిస్తున్నారు. కొందరు వెటకారంగా కామెంట్లు కూడా చేస్తున్నారు.