కన్నుకుట్టి పాటపై ముస్లింల కోపానికి ఇదీ కారణం! - MicTv.in - Telugu News
mictv telugu

కన్నుకుట్టి పాటపై ముస్లింల కోపానికి ఇదీ కారణం!

February 14, 2018

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇప్పుడు దేశంలో, మీడియాలో ఏ నోట విన్నా ఆమె పేరే.. క్షణాల వ్యవధి ఉన్న కన్నుకొట్టే సీనుతో దేశమంతా తెలిసిపోయిన ఈ 18 ఏళ్ల మలయాళీ సినీభామపై హైదరాబాద్‌లో కొందరు ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తమ మనోభావాలను గాయపరచిందని, మాణిక్య మలరాయ పూవీ అంటూ సాగే ఈ పాటలో మహహ్మద్ ప్రవక్తను, ఆయన భార్యను అగౌరవించారని మండిపడుతున్నారు. ప్రియపై, సినిమా టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పాటలో ఏముంది?

‘ఒరు ఆదార్ లవ్’ సినిమా కోసం పీఎంఏ జబ్బార్ అనే రచయిత ఈ పాట రాయగా, వినీత్ శ్రీనివాసన్ ఆలపించాడు. ప్రియ, హీరో రోషన్ అబ్దుల్లా రవూఫ్ తదిరులపై చిత్రించారు. రొమాంటిక్ భావాలతో సాగే ఈ పాటలో మహమ్మద్ ప్రవక్త, ఆయన భార్య ఖజీదాల ప్రేమ గురించి వివరించారు. ప్రవక్తను పల్లెత్తుమాట అంటే ముస్లింలు భరించలేరు. ఇక అలాంటిది ఆయన, ఆయన భార్య పేరుతో రొమాంటిక్ ప్రేమగీతాన్ని పెడితే ఊరుకుంటారా? అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాటలో ప్రవక్త, ఖదీజా మధ్య ప్రేమానురాగాలను వివరించారు. నిజానికి మాణిక్య మలరాయ పూవీ పాటను జబ్బార్ 1978లో రాశారు. అంతకు ముందు నుంచే మలబార్ ప్రాంతంలో ముస్లిం మహిళలు తరతరాల నుంచి మాణిక్య మలరాయ పూవీ అంటూ పాడుకునేవారు. జబ్బార్ ఆ పాటకు కాసిని మార్పులు చేశారు.

పాటగా చూస్తే అందులో ఏ అభ్యంతరాలు కనిపించవు. ఖదీజాను, ప్రవక్తను గౌరవంగానే సంబోధించారు. చరిత్రలో ఉన్న విషయాలనే చెప్పారు. చరిత్ర ప్రకారం.. ఖదీజా ఒక వ్యాపారి కుమార్తె.. పాటలోనూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. ప్రవక్తకు అత్యంత ఇష్టమైన భార్య ఖదీజానే అని చరిత్ర చెబుతోంది. అయితే మతం కోణంలో చూస్తే తీవ్ర అభ్యంతరాలే కనిపిస్తాయి..

ఈ పాట సారాంశం ఇదీ..  

ముత్యపు పువ్వంటి బాలా..

మహారాజశ్రీ ఖదీజా బీవీ

పవిత్ర మక్కానగరిలో మహారాణీ..

ఆమె మహమ్మదు ప్రవక్తను పిలిచి

తన వ్యాపార ప్రతినిధిగా పంపింది

తొలి చూపులో అతణ్ని వలచింది

ధన్యజీవి ఆ రసూలల్లా తిరిగొచ్చాడు

 అతనితో పెళ్లి ఆమె మనోవాంఛ..