తొలిసారి విమానం ఎక్కబోతున్నా.. ప్రియా ప్రకాశ్ - MicTv.in - Telugu News
mictv telugu

తొలిసారి విమానం ఎక్కబోతున్నా.. ప్రియా ప్రకాశ్

February 27, 2018

కన్నుకొట్టి దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెకు ఇప్పటికే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రియ.. రాత్రికి రాత్రికే సెలబ్రిటీ అయ్యింది. ‘ఒరు ఆదార్ లవ్’లోని ఆ కన్నుకొట్టే సీన్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.ప్రియ ఆ సంబరం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. అందరికీ ధన్యావాదాలు చెబుతోంది. ఆమె ఇంటర్వ్యూలు, ట్వీట్లపై జనంలో పిచ్చ ఆసక్తి పెరిగిపోయింది. తాజాగా ప్రియ ఓ టికెట్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్నానని తెలిపింది. కొచ్చి నుంచి తిరువనంతపురానికి ఇండిగో విమానంలో వెళ్తున్నానని వెల్లడించింది. ప్రియపై హైదరాబాద్, ముంబై తదితర నగరాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే వాటిని ఆమె చాలా లైట్‌గా తీసుకుంటోంది.