ఈ నెల 23 ప్రియదర్శి పెళ్లిసందడి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నెల 23 ప్రియదర్శి పెళ్లిసందడి

February 20, 2018

‘పెళ్లిచూపులు’ సినిమా ఫేం ప్రియదర్శి టాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న యువ కెమెడియన్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు చాలా సినిమాలు చేస్తున్నాడు. చిన్నపాత్రలోనే అయినా చక్కని నటనతో మెప్పిస్తున్నారు. అర్జున్ రెడ్డి, తొలి ప్రేమ, అ! వంటి సినిమాల్లో హాస్యాన్ని పండించాడు. తెలంగాణ యాసలో అతడు వేసే పంచులకు జనం విరగబడి నవ్వుతున్నారు.ఇటీవల ప్రేమికుల రోజు సందర్భంగా ప్రియదర్శి ఒక భావోద్వేగ ప్రేమలేఖను సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి సంగతి తెలిసిందే. రిచా అనే యువతిని తాను ప్రేమిస్తున్నానంటూ పరిచయం చేశాడు. దీంతో ఆమె, ఎవరు? ఈ ప్రేమాయణం ఎంతరవకు వచ్చిందని జనంలో ఆసక్తి పీక్‌కు వెళ్లింది. ఫిలింనగర్లో దీనిపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. అందులో ఒక వార్త ఇది. ఈ నెల 23న హైదరాబాద్‌లో ప్రియదర్శి పెళ్లి జరగనుందని. రిచా సాధారణ కుటుంబ యువతి, అని పెళ్లికి వధూవరుల కుటుంబాలు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరుకానున్నారని సమాచారం. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం 26న గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఇవ్వనుందీ జంట.