కామ్రేడ్ భారతక్కకు శుభాకాంక్షలు : హీరో రానా - MicTv.in - Telugu News
mictv telugu

కామ్రేడ్ భారతక్కకు శుభాకాంక్షలు : హీరో రానా

June 4, 2020

priyamani..

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా కామ్రేడ్ భారతక్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. విరాట పర్వం సినిమాలోని ప్రియమణి నటిస్తున్న ఓ క్యారెక్టర్ పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ విధంగా విషెష్ చెప్పింది. ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో రానా వివరించే ప్రయత్నం చేశాడు. 

‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్‌ భారత్క కూడా అంతే కీలకం’ అంటూ పరిచయం చేశాడు. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో రానా, సాయి పల్లవి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మావోయిస్టు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా కొన్ని  సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది. అన్ని పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగులో మెప్పించి తనకంటూ ఓ మార్క్ సంపాధించుకున్న ప్రియమణి ఈసారి కొత్త క్యారెక్టర్‌లో కనిపించనుండటంతో ఆమె అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.