ఆ సినిమాలో మహానటి పోయె ప్రియమణి వచ్చె - MicTv.in - Telugu News
mictv telugu

ఆ సినిమాలో మహానటి పోయె ప్రియమణి వచ్చె

January 19, 2020

fvgt

ఓ సినిమాలో కీర్తి సురేశ్ స్థానంలో ప్రియమణి వచ్చేసింది. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్‌ తప్పుకోవడంతో ప్రియమణికి ఆ పాత్ర దక్కింది. అదీ విజయ్ దేవ్‌గణ్ సరసన. భారత ఫుట్‌బాల్‌ మాజీ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ‘మైదాన్’ అనే చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో అజయ్‌ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో 

ఆయన భార్య పాత్రలో ప్రియమణి మెరవనుంది. తొలుత ఈ పాత్ర కోసం కీర్తి సురేశ్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. అయితే కీర్తి సురేశ్‌ను ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పించారు అనే ప్రశ్నకు దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కీర్తి ఈ చిత్రంలో పెద్ద వయస్కురాలి పాత్రలో నటించాల్సి ఉండగా.. అందుకు ఆమె సరిపోదని చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రం అంగీకరించినప్పుడు కీర్తి కొద్దిగా బరువుగా ఉన్నారని.. ప్రస్తుతం ఆమె సన్నబడ్డారని నిర్మాతలు తెలిపారు. అందుకే ఆమెకు బదులుగా ప్రియమణిని తీసుకున్నాం అని వెల్లడించారు. కీర్తి కూడా తను ఆ పాత్రకు సరిపోననే భావనలో ఉండటంతో ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు తెలిపారు. జీ స్టూడియోస్‌, బోని కపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ప్రసుత్తం ప్రియమణి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో శశికళ పాత్రలో నటిస్తోంది.