ప్రియమణికి పెళ్లయిపోయె.. ! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియమణికి పెళ్లయిపోయె.. !

August 23, 2017

దక్షిణాది ప్రేక్షకుల ప్రియనటి ప్రియమణి పెళ్లి గురువారం వ్యాపారవేత్త ముస్తాఫా రాజ్ తో చాలా సింపుల్ గా జరిగిపోయింది. కొన్నేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటూ, ఎక్కడపడితే అక్కడ లైట్ రొమాన్స్ తో కనువిందు చేస్తూ కనిపించిన వీరు బెంగళూరు శివాజీ నగర్ లో రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లిని నిరాడంబరంగా చేసుకున్నా మెహందీ కార్యక్రమాన్ని మాత్రం ఘనంగా నిర్వహించారు. ఎరుపు పట్టు దుస్తుల్లో మణి తళతళలాడిపోయింది. ముస్తఫాను పెళ్లాడుతున్నట్టు చాలా రోజులకిందటే ప్రకటించిన ప్రియమణి పెళ్లి వేదికను మాత్రం చివరి వరకు రహస్యంగా ఉంచింది. అటు మీడియా, ఇటు అభిమానులు పెళ్లి ఎక్కడ జరుగుతుందా అని బుర్ర బద్దలు కొట్టుకున్నారు.

శుక్రవారం ఆ కొత్త జంట రిసెప్షన్ ఇవ్వనుంది.  బెంగళూరులోనే జరిగే ఈ కార్యక్రమానికి దక్షిణాది తారలతోపాటు బాలీవుడ్ తారలు కూడా హాజరు కానున్నారు. ముంబైకి చెందిన ముస్తఫా వ్యాపారంలో బాగానే గడించాడు. ఆయనకు చాలా దేశాల్లో వ్యాపారాలున్నాయి.

పెళ్లి తర్వాత కూడా నటిస్తానన్న ప్రియమణి.. హనీమూన్ గట్రా తంతులేమీ పెట్టుకోకుండా రేపోమాపో షూటింగుల్లో పాల్గొననుంది.