గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’. మయామీలో ఆదివారం ఈ సినిమా ప్రీమియర్ షోను నిర్వహించారు. ఈవెంట్‌కు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది. ‘బేవాచ్ షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాను. సహనటులు నాతో చాలా బాగా కలిసిపోయారు. నా పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. బేవాచ్ని సమ్మర్ ఫన్‌గా ఎంజాయ్ చేయచ్చు.
కానీ సినిమాకు మీ పిల్లల్ని మాత్రం తీసుకెళ్లకండి’ అని తెలిపింది ప్రియాంక. ఇందులో ప్రియాంక విక్టోరియా లీడ్స్ అనే విలన్ పాత్రలో నటించింది. భారత్‌లో ఈ సినిమా జూన్2న రిలీజ్ అవుతుంది.
HACK:
- Priyanka Chopra announces her first Hollywood movie Baywatch not to be watched with Children.