Home > Featured > ప్రియాంక దంపతులు సూపర్.. అభిమాని కోసం ఆస్పత్రికే వెళ్లారు.. 

ప్రియాంక దంపతులు సూపర్.. అభిమాని కోసం ఆస్పత్రికే వెళ్లారు.. 

తమను అభిమానించే అభిమానులను అర్థం చేసుకునేవారే అసలైన హీరోలు అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్‌ సోదరులపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అభిమానులు లేకపోతే తాములేమని చాలా కొద్దిమంది మాత్రమే గ్రహించి వారికి విలువ ఇస్తారు. చాలామంది సెలెబ్రిటీలు అభిమానుల పట్ల ప్రేమగానే వున్నామని పైకి చెప్తారు గానీ, పట్టించుకునేవారు చాలా తక్కువ అంటున్నారు. ఇంతకీ ప్రియాంక దంపతుల జంట నెటిజన్ల ప్రశంసలు పొందడానికి కారణం ఏంటంటే..

శనివారం జరిగిన మ్యూజిక్‌ కాన్సర్ట్‌కు ఓ అభిమాని రాలేకపోయింది. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె ఆ కార్యక్రమాన్ని మిస్సయ్యానని బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జోనస్‌ బ్రదర్స్‌ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి ఆమెను సంభ్రమాశ్చర్యానికి గురిచేశారు. అన్నదమ్ములతో పాటు ప్రియాంక కూడా ఆమెతో మాట్లాడారు. కాసేపు ఆమె ముందు కొన్ని పాటలు ఆలపించారు. చిన్నగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 1 Sep 2019 9:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top