మరీ ఇంత అంగాంగ ప్రదర్శనా? అదరగొట్టిన ప్రియాంక - MicTv.in - Telugu News
mictv telugu

మరీ ఇంత అంగాంగ ప్రదర్శనా? అదరగొట్టిన ప్రియాంక

January 27, 2020

Priyanka chopra.

బాలీవుడ్ తారలు హాలీవుడ్‌లో అడుగుపెట్టడం అరుదు. పెట్టినా నిలదొక్కుకోలేక మళ్లీ బాలీవుడ్‌కు వచ్చేస్తుంటారు. కానీ   ప్రియాంక మాత్రం మొండిఘటం. హాలీవుడ్ అంతు తేల్చానంటున్న ఈ భామపై వివాదాలు కూడా ఎక్కువే. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లాడిందని, తనకు తెలియని విషయాలపై మాట్లాడుతుందని బోలెడు విమర్శలు ఉన్నాయి. అయినా ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఆమె తన చిత్తం వచ్చినట్లు చేసేస్తుంటుంది. 

తాజాగా గ్రామీ అవార్డుల కార్యక్రమంలో ఆమె తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వక్షోజాలు సగభాగం కనిపించేలా డిజైన్ చేసిన డ్రస్సుతో హొయలొలికించింది. కొందరు కెమెరామెన్లు కూడా.. ‘ఇండియన్ యాక్ట్రెస్ ఇంత బోల్డ్ గానా’ అని ఆశ్చర్యపోయారు. ప్రియాంక పూర్తిగా మారిపోయిందని మరికొందరు అంటున్నారు. ఆమె పక్కన భర్త నిక్ జోనాస్ కూడా కెమెరాలకు పోజిలిస్తూ మరింత సందడి పెంచేశాడు. ప్రియాంక గతంలోనూ ఇలాంటి డ్రెస్సులు వేసినా, శరీరాన్ని ఛాతీ నుంచి పొట్ట వరకు బొడ్డు కూడా కనిపించేలా డ్రెస్సు వేసుకోవడం బహుశా ఇదే తొలిసారి అని డిజైనర్లు అంటున్నారు.