మరి నువ్వేం చేశావ్! - MicTv.in - Telugu News
mictv telugu

మరి నువ్వేం చేశావ్!

September 12, 2017

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ’యూనిసెఫ్ గుడవిల్’ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ఆమె యూనిసెఫ్ తనపున  సిరియాలోని పిల్లలకు విద్యా సహాయం చెయ్యడానికి జోర్డాన్ వెళ్లారు.  అక్కడి పిల్లలతో సరదాగా దిగిన ఫొటోలను ప్రియాంక ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది. అయితే ఆ ఫోటో చూసి ఓ నెటిజన్ స్పందిస్తూ ’గ్రామీణ భారత్ లోనూ ఆకలితో బాధపడుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రియాంక వారందికి సహాయం చేస్తే బాగుంటుందని కోరుతున్నా’ అని కామెంట్ చేసాడు. దీనిపై ప్రియాంక కూడా గట్టిగానే స్పందించింది. `నేను యునిసెఫ్‌తో  క‌లిసి 12 సంవ‌త్స‌రాలుగా పిల్ల‌ల క్షేమం కోసం ప‌నిచేస్తున్నాను.  మరి నువ్వు ఏం చేశావ్? నాకు ప్రపంచంలో ఉన్న అందరు పిల్లలూ ఒకటే. అయినా ఒక చిన్నారి సమస్యను  మరో చిన్నారితో ఎందుకు పోలుస్తున్నావ్ ?‘  అని ఆమె నెటిజన్ ను ప్రశ్నించింది.