ప్రియాంక భర్తపై ఆడ అభిమాని లైంగిక వేధింపులు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక భర్తపై ఆడ అభిమాని లైంగిక వేధింపులు (వీడియో)

October 27, 2019

హీరోయిన్లకే కాదు, హీరోలకూ అలాంటి వేధింపులు ఎదరవుతుంటాయి. తరచూ కాకపోయినా కొన్నాసార్లయినా కొందరు మగ సెలబ్రిటీలు అమ్మాయిల బారిన పడుతుంటారు. ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా భర్త, నటగాయకుడు నిక్ జోనాస్‌కు అలాంటి చేదు అనుభవం ఎదురైంది. నిక్ తన సోదరులతో కలసి కచేరీ చేస్తుండగా ఓ ఆడ అభిమాని అతనిపై పబ్లిగ్గా లైంగిక వేధింపులకు పాల్పడింది. వెనకవైపు నుంచి అతని తొడలను, పిరుదులను తాకుతూ నానా యాగీ చేసింది. మొదట అభిమానంతో అలా చేస్తోందనుకున్న నిక్ అభిమానం కాస్తా శ్రుతి మించడంతో వెనక్కి తిరిగి మందలించాడు. ఈ దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో ఈ తతంగం జరిగింది. నిక్‌పై అభిమాని పైత్యం శ్రుతిమించడంతో అతని భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను అడ్డుకోబోయారు. అయితే అంతలోపే నిక్ ఆమెను సుతిమెత్తగా మందలించాడు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ అమ్మాయి చేసింది తప్పేమీ కాదని, అభిమానంతో తాకడం లైంగిక వేధింపు ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అతడు మగవాడు కనుక అతణ్ని ఏం చేసినా ఫర్వాలేదా? ఒకవేళ అతని స్థానంలో ప్రియాంక ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అని మరికొందరు మండిపడుతున్నారు.