మిస్ యూనివర్శ్, నటి ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురిని పరిచయం చేసింది. ప్రిాంక చోప్రా ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తన సినిమా విషయాలు, వ్యక్తిగత జీవితం, నిక్-తను కలిసి ఉన్నప్పుడు ఫోటోలు అన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం చాలా నెలలుగా సీక్రెట్ గా ఉంచింది ప్రియాంక. అదే తన కూతురు విషయం. కూతురు పుట్టడం, పేరు, మొహం కనిపించకుండా ఫోటోలు ఇలా అన్నీ షేర్ చేసుకుంది కానీ డైరెక్ట్ గా ఎప్పుడూ చూపించలేదు. అడిగినా కూడా దాటవేస్తూ వచ్చింది.
ఇప్పడు అది కూడా రివీల్ చేసేసిందీ బ్యూటీ. రీసెంట్ గా జొనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్ లో కూతురు మాల్తీతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో బాగా ఛక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక నవ్వుతూ ఉంటే తన ఒళ్ళో నిల్యుని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ క్యూట్ గా ఉంది. ప్రియాంక ఇంతకు ముందే చెప్పినట్టు మాల్తీ అచ్చు నిక్ జొనాస్ లా ఉంది.
2018లో పెళ్ళి చేసుకున్న నిక్-ప్రియాంక చోప్పాలు సరోగసీ ద్వారా బిడ్డని కన్నారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇదే ఫస్ట్ టైమ్ కూతురిని చూపించడం. మొదటిసారి మాల్తీ ఫేస్ ను రివీల్ చేయడంతో ప్రియాంక ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.