కుయ్..కుయ్.. పడగ్గదిలో భర్తకు ప్రియాంక సర్‌ప్రైజ్ గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కుయ్..కుయ్.. పడగ్గదిలో భర్తకు ప్రియాంక సర్‌ప్రైజ్ గిఫ్ట్

December 2, 2019

Priyanka Chopra Surprised husband Nick Jonas With A New Dog

భార్యాభర్తలు అన్నాక సర్ప్రైజ్‌ బహుమతులు సహజం. పుట్టినరోజు, పెళ్లిరోజులకు.. ఏ రోజూ లేకపోయిన పనిగట్టుకుని మరీ భార్యాభర్తలు ఒకరికి ఒకరు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చుకుంటారు. బాలీవుడ్, హాలీవుడ్ నటి  ప్రియాంక చోప్రా.. బెడ్రూంలో బజ్జున్న తన భర్త నిక్ జోనాస్‌కు సర్ప్రైజ్‌ చేసింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త నిక్ బెడ్‌పై పడుకుని ఉండగా ప్రియాంక అతన్ని నిద్ర లేపి మరీ తన బహుమతిని ప్రజెంట్ చేసింది. అది చూసి నిక్ ముందు షాక్ అయ్యాడు. ఆ తర్వాత సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఇంతకీ ప్రియాంక ఇచ్చిన ఆ స్వీట్ గిఫ్ట్ ఏంటో తెలుసా..కుక్కపిల్ల!

 

ఓ ముద్దొచ్చే కుక్కపిల్లను ప్రియాంక తన భర్తకు బహుమతిగా ఇచ్చింది. అది చూసి నిక్ కూడా చాలా సంతోషించాడు. ప్రియాంక, నిక్ జోనాస్ జంట ఇప్పుడు వరల్డ్‌లోనే మోస్ట్ ఫేమస్ సెలెబ్రిటీ జంట అయిపోయారు. దాంతో వాళ్లేం చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఇది ఒకటి. బెడ్రూమ్ గిఫ్ట్ అందుకున్న తర్వాత మరి ప్రియాంకకు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తాడా అని ఈ జంట అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు. ప్రియాంక-నిక్ జోనాస్ 2018లో ప్రేమవివాహం చేస్తుకున్నారు.