ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రియాంక - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రియాంక

November 1, 2017

న్యూయార్క్ లోని డబ్ల్యూటీసీ వద్ద జరిగిన ఉగ్రవాద దాడి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ దాడి తను నివసిస్తున్న అపార్టుమెంటుకు కేవలం ఐదు బ్లాకుల దూరంలోనే జరిగిందని ఆమె ట్వీట్ చేవారు.

‘నేను హాలీవుడ్‌ టీవీ సీరియల్‌ క్వాంటికో -3 సిరీస్‌ షూటింగ్‌ ముగించుకుని ఇంటికి వస్తున్నాను. మా ఇంటి దగ్గర అంతా కోలాహలం..  సైరన్ల మోత.. ఎటు చూసినా పోలీసులు..  నేను హడలిపోయాను. నాకు అప్పడే తెలిసింది ఇప్పుడే ఇక్కడ ట్రక్కు దాడి జరిగింది అని. ఆ చప్పుడు ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితి తెలుపుతోంది. ’ ’’ అని ఆమె ట్వీట్ చేశారు. దురాగతంలో చనిపోయిన వారికి ఆత్మలకు శాంతి కలగాలని ఆమె ప్రార్థించారు.