ఆ మౌలానాకెక్కడో మండింది ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆ మౌలానాకెక్కడో మండింది !

June 15, 2017

మన దేశం ఆర్థికంగా, సామాజికంగా ఎంతెత్తుకెదిగినా ఆడవాళ్ళ ఎదుగుదల మాత్రం మగాళ్ళ కాళ్ళ కిందే అణిచివేయబడుతుందనేది పక్కా సహీ మాట. దంగల్ సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ బికినీ ధరించిందని, ప్రియాంక ఛోప్రా మోడీ మందు కాలు మీద కాలేస్కొని కూర్చొని పిక్కలు చూపించడం కరెక్ట్ కాదని ఒక వర్గం వారు వాళ్ళ తీవ్రంగా విమర్శలకు దిగారు. అప్పట్లో సానియా మీర్జాకు ఫత్వా జారీ చేసినట్టు ఫాతిమాను కూడా ఆ సామాజిక వర్గం నుండి వెలేద్దామని చూసిన ఆ సాంప్రదాయవాద మౌలానాకు దిమ్మ తిరిగే ఆన్సర్లు ఇచ్చింది ఈ ‘ రన్ బై ఎ వుమెన్ ’ ఆర్గనైజర్ ఫెయీ డిసౌజా. బజ్ ఫీడ్ ఇండియా ఛానల్లో అమ్మాయిలు అండర్ వేర్ వేస్కొని రోడ్డు మీదకొస్తే మగాళ్ళతో సమానమైపోతారా అనే మౌలానా వాదనకు మూతోడ్ సమాధానమిచ్చిందామె.

అలాగా.. నిండా బట్టలేస్కొని మళ్ళీ వంటింటిలో బానిసల్ని చెయ్యండి.. అప్పుడు ఎంచక్కా మీకిష్టమైనవి వండి పెడుతూ అలా పడుంటాం… అని చాలా ఘాటుగా సమాధనమిచ్చింది. ఈ వీడియోని చూసిన ఫెమినిస్టులు ఫెయీ డిసౌజా ఆత్మ స్థైర్యానికి మెచ్చుకోలేక వుండలేక పోతున్నారు. ఆడవాళ్ళు ఇలా వుండాలి, అలా వుండాలి, ఈ బట్టలే తొడగాలి, మేము చెప్పిందే వినాలి, మేము చెప్తేనే తినాలి, మేము చెప్తేనే బయటకు వెళ్ళాలి.., వంటి సాంప్రదాయ వాదాన్ని అడ్డు పెట్టుకొని పురుషులు స్త్రీలను ఎంతగా అణిచివేతకు గురి చేస్తున్నారో.. అలా కాకుండా స్త్రీ కూడా పురుషుడుకి ఎందులోనూ తక్కువ కాదు.

తనకు నచ్చినట్టు తాను బతుకుతుంది వద్దనడానికి మగాడు ఎవరు ? తనకు నచ్చిన బట్టలేస్కుంటుంది, తన ప్రొఫేషన్ కి న్యాయం చేస్తుంది అంతే.. సానియా మీర్జా చిన్న స్కర్ట్ వేస్కున్నంత మాత్రాన తను బరితెగించినట్టు కాదు. వాళ్ళ జాబ్స్ కి వాళ్లు న్యాయం చేస్తున్నారంతే అనేది పురుషులు గమనిస్తే మంచిదని ‘ Run by a women ’ అనే స్త్రీ హక్కుల కోసం పోరాడే సంస్ధ తరుపున ఈమె పోరాడుతున్నది. ఆడవాళ్ళ విషయంలో మగాళ్ళ ఆలోచనలు మారాలనే ఆమె సంకల్పం నెరవేరే దిశలో సాంప్రదాయం వాదం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటూ స్త్రీల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నది. మగాళ్ళే ఆడవాళ్ళ విషయంలో ఎప్పుడు మారతారో !?