ప్రియాంకా చోప్రా ఎందుకిలా చేస్తోంది... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంకా చోప్రా ఎందుకిలా చేస్తోంది…

June 1, 2017

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తెలిసి చేస్తుందో..తెలియక చేస్తుందో గానీ ..ఏదీ చేసినా వివాదాస్పదమవుతూనే ఉంది. మొన్న‌నే స్క‌ర్ట్ వేసుకుని ప్ర‌ధాని మోదీతో కాలుపై కాలేసుకుని మాట్లాడిన ప్రియాంక …తాజాగా హోలోకాస్ట్ మెమోరియ‌ల్ దగ్గర సెల్ఫీ దిగింది. సోద‌రుడితో క‌లిసి హోలోకాస్ట్ స్మార‌క ప్ర‌దేశానికి వెళ్లిన చోప్రా అక్క‌డ సెల్ఫీ దిగ‌డం ప‌ట్ల వివాదం రేగింది. హోలోకాస్ట్ బాధితుల‌ను ప్రియాంకా అవమానించింద‌ని కొంద‌రు నెట్‌జ‌న్లు తిట్టిపోస్తున్నారు.. సున్నిత‌మైన అంశాల ప‌ట్ల ప్రియాంకకు అవ‌గాహ‌న లేద‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. జ‌ర్మ‌నీకి చెందిన నాజీలు రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో సుమారు 30 ల‌క్ష‌ల మంది యూదుల‌ను ఊచ‌కోత కోశారు. ఆ ఘ‌ట‌న‌కు స్మృతిగా హోలోకాస్ట్ మెమోరియ‌ల్‌ను నిర్మించారు. అలాంటి ప్ర‌దేశంలో బేవాచ్ స్టార్ సెల్ఫీ దిగ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. ప్ర‌ధాని మోదీ ముందు స్క‌ర్ట్ వేసుకుని ఫోటో దిగినా ఫ‌ర్వాలేదు కానీ, యూదుల స్మార‌కం ద‌గ్గ‌ర సెల్ఫీ ఏంటి అంటూ నెటిజన్లు సీరియస్ అయ్యారు. దీంతో మేల్కొన్న ప్రియాంకా చోప్రా అకౌంట్ నుంచి హోలోకాస్ట్ సెల్ఫీని తీసేసింది.