Priyanka Gandhi as in-charge of Telangana
mictv telugu

కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం.. తెలంగాణ ఇంఛార్జ్‌గా ప్రియాంక గాంధీ

August 13, 2022

Priyanka Gandhi as in-charge of Telangana

రోజురోజుకీ క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తిరిగి చర్యలు ప్రారంభించింది. పార్టీ బలంగా ఉన్న చోట మరింత దెబ్బతినకుండా దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఆ వ్యూహంలో భాగంగా త్వరలో ఎన్నికలు జరిగే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇంఛార్జీగా ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీని నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు శనివారం నిర్వహించగా, తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

తెలంగాణ, కర్ణాటకల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్ల నష్టపోతున్నామని గ్రహించి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రియాంక నియామకం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో ఈ నియామకం చర్చనీయాంశమైంది. ఇక త్వరలో ఉప ఎన్నిక జరుగునున్న మునుగోడుపై ఈ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి. శివకుమార్‌ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో వీటిని చక్కబెట్టే బాధ్యతలను ప్రియాంక తీసుకుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.