మన ఎంపీలు రావొద్దు.. వారొస్తే తప్పులేదా.? : ప్రియాంక గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

మన ఎంపీలు రావొద్దు.. వారొస్తే తప్పులేదా.? : ప్రియాంక గాంధీ

October 29, 2019

జమ్మూ కశ్మీర్ యూరోపియన్ యూనియన్‌ కూటమికి చెందిన దేశాల ఎంపీలు పర్యటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానానంపై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఇతర దేశాలకు చెందిన ఎంపీలకు కశ్మీర్‌లో పర్యటించే అవకాశం ఇస్తున్నారు. కానీ మన దేశ ఎంపీలకు మాత్రం అనుమతి ఇవ్వకుండా ఎయిర్ పోర్టుల నుంచే వెనక్కి పంపిస్తున్నారు. ఇది వారి జాతీయవాదం’ అంటూ ట్వీట్ చేశారు. 

కాగా జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఈయూ ఎంపీ భారత్ వచ్చారు. 27 మందితో కూడిన ఈ బృందం పలు అంశాలపై అధ్యయనం చేయనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజాప్రతినిధులను ఎవరినీ జమ్మూ కశ్మీర్‌కు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎంపీలు గులాంనబీ ఆజాద్, రాహుల్ గాంధీ రెండు సార్లు ప్రయత్నించినా వారిని ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో మన దేశ ఎంపీలకు అనుమతి ఇవ్వకుండా ఇతర దేశాల నేతలకు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రియాంక ప్రశ్నించారు.